Balakrishna: బోయపాటికి కాస్త స్టయిల్ మార్చమని చెప్పిన బాలయ్య!

  • బాలకృష్ణ తాజా చిత్రంగా రూపొందిన 'రూలర్'
  • స్క్రిప్ట్ పై బోయపాటి కసరత్తు 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేదిశగా సన్నాహాలు 
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ అనగానే అభిమానుల్లో ఒకరకమైన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. 'లెజెండ్' చిత్రాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. హ్యాట్రిక్ హిట్ కోసం ఈ ఇద్దరూ మరోసారి సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.

అయితే యాక్షన్ పాళ్లు హద్దులు దాటకుండా చూడమని బోయపాటికి బాలకృష్ణ చెప్పారట. అంతేకాదు మాస్ ఆడియన్స్ తో పాటు యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చేలా కథాకథనాల్లో కొత్తదనం ఉండేలా చూడమని అన్నారట. ఆ సూచనలను దృష్టిలో పెట్టుకునే బోయపాటి స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నాడని చెబుతున్నారు. ఇక కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన 'రూలర్' చిత్రం, త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది.
Balakrishna
Boyapati

More Telugu News