Tamil Nadu: రాబోయే రోజుల్లో ఆశ్చర్యకర పరిణామాలు: బాంబు పేల్చిన రజనీకాంత్

  • రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు
  • ముఖ్యమంత్రి అయ్యేందుకు ఏళ్ల తరబడి కలలు కనాల్సిన పనిలేదు
  • సీఎం అవుతానని పళనిస్వామి కలగన్నారా?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఆశ్చర్యకర పరిణామాలు జరగబోతున్నాయని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చన్న రజనీకాంత్.. ఇందుకు తమిళనాడు రాజకీయాలే నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు ఏళ్ల తరబడి కలలు కనాల్సిన పనిలేదని అన్నారు. ముఖ్యమంత్రిని కావాలని పళనిస్వామి ఏనాడైనా కలలు కన్నారా? అని ప్రశ్నించారు. అలాగే, రేపు మరెవరైనా సీఎం కావొచ్చని అన్నారు. రజనీకాంత్ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

2017లోనే రాజకీయాల్లోకి వచ్చిన రజనీకాంత్ ఇప్పటి వరకు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పార్టీ పెట్టడంపైనా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇటీవల బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ ఊహాగానాలను రజనీ ఖండించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. తన గురించి తాను చేసుకున్నవేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Tamil Nadu
Rajinikanth
palanisamy
politics

More Telugu News