Koti Deepotsavam: కోటి దీపోత్సవానికి హాజరైన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

  • హైదరాబాద్ లో కోటిదీపోత్సవం
  • ఎన్టీఆర్ స్టేడియంలో వేడుకలు
  • ముగిసిన కోలాహలం
భక్తి టీవీ చానల్ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం పరిసమాప్తం అయింది. కార్తీక మాసంలో నిర్వహించిన ఈ మహాదీప యజ్ఞం ముగిసింది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా చివరి రోజున రాజరాజేశ్వరి కల్యాణం నిర్వహించారు. కొల్హాపూర్ మహాలక్ష్మీ దివ్యదర్శనంతో వేలాది భక్తులు తరించిపోయారు. కాగా, చివరి రోజున ఈ కోటి దీపోత్సవానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. భక్తి టీవీ అధినేత నరేంద్ర చౌదరి జనసేనాని పవన్ కల్యాణ్ ను తోడ్కొని ఆయనతో జ్యోతి ప్రజ్వలనం చేయించారు.
Koti Deepotsavam
Pawan Kalyan
Bhakti Tv
Hyderabad

More Telugu News