Andhra Pradesh: ‘ఇంగ్లీషు’పై పట్టులేక ఎంతో మంది ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారు: ఏపీ విద్యాశాఖ మంత్రి సురేశ్

  • పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే ‘ఇంగ్లీషు’ రావాలి
  • అందుకే, ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నాం
  • వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన
ఇంగ్లీషు భాషపై పట్టులేక ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని, అందుకే, పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడేందుకు ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన వుంటుందని చెప్పారు. వెనుకబడిన వర్గాల వారికి ఉన్నత విద్యను అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, అమ్మఒడి పథకం ద్వారా పేదలను విద్యకు దగ్గర చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ గురించి ఆయన ప్రస్తావించారు. రాధాకృష్ణ రాతలపై చర్యలు తీసుకుంటామని, మతం పేరిట దుష్ప్రచారంపై లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Andhra Pradesh
Aadimulap
suresh
Minister

More Telugu News