Cow dung cakes: అమెరికా షాపుల్లో అమ్మకానికి ఆవు పిడకలు!

షార్ట్స్‌లో చూడండి
ఆవు పిడకల వ్యాపారం అమెరికాకు పాకింది. ఆన్ లైన్ మార్కెట్లో ఆవు పేడ, పిడకల అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. వీటికి భారత్ లో డిమాండ్ ఓ స్థాయిలో ఉంది. తాజాగా విదేశాల్లో.. ముఖ్యంగా అమెరికాలో వీటికి డిమాండ్ పెరుగుతోంది.  న్యూజెర్సీలో ని ఓ షాప్ లో ఆవు పేడతో రూపొందించిన పిడకలు ప్యాకెట్లలో అమ్మకానికి పెట్టారు. ఆంగ్లంలో వీటికి 'కౌ-డంగ్ కేక్స్' అని పేరు పెట్టారు.  

‘ఇది ఓ భారతీయ ఉత్పత్తి, ఇది తినే పదార్థం కాదు. మతపరమైన విషయాల్లో మాత్రమే దీన్ని ఉపయోగించాలి’ అని ప్యాకెట్ మీద ముద్రించి ఉండటం విశేషం. పది పిడకలు ఉన్న ఓ ప్యాకెట్ ధర మన రూపాయల్లో 214 గా ఉంటుంది. స్థానికంగా నివసించే ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి దీన్ని ఫోటో తీసి తన బంధువుకు పంపించాడు. అనంతరం ఇది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ అవడంతో వైరల్ గా మారింది.
Go Back to Shorts
Cow dung cakes
Selling In American Shops

More Telugu News