Crime News: కర్ణాటక ఎమ్మెల్యేపై కత్తితో దాడి... తీవ్రగాయాల పాలైన తన్వీర్‌ సైత్‌

  • గత అర్ధరాత్రి మైసూరులో ఘటన
  • ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న తన్వీర్
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 
కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తన్వీర్‌ సైత్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి అలజడి రేపాడు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గత అర్ధరాత్రి మైసూరులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. తన్వీర్‌ సైత్‌ భద్రతా సిబ్బంది వెంటనే దుండగుడి బారి నుంచి ఆయనను కాపాడారు. ఆయనను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
 
దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడు ఫర్హన్‌ పాషాను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఈ దాడి చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. తన్వీర్ సైత్ కర్ణాకటలోని నరసింహారాజ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో ఆయన అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూస్తూ కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే.
Crime News
Karnataka

More Telugu News