Vijay Sai Reddy: గతంలో చంద్రబాబు కమీషన్లకు కక్కుర్తి పడ్డారు: విజయసాయి రెడ్డి

  • సోలార్‌ పవర్‌ రూ.2.80కే సరఫరా 
  • ఇందుకు ఎన్టీపీసీ, సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్ లు ముందుకొచ్చాయి
  • గతంలో యూనిట్‌ రూ.5 చొప్పున ప్రైవేట్‌ సంస్థలతో చంద్రబాబు పీపీఏలు
  • రాష్ట్రంపై పెను భారం మోపాడు
సోలార్‌ పవర్‌ రూ.2.80కే సరఫరా చేయడానికి ఎన్టీపీసీ, సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్ లు ముందుకొచ్చాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కమీషన్లకు కక్కుర్తిపడడం మూలంగానే ధర అధికంగా ఉండేదని ఆరోపించారు.

'సోలార్‌ పవర్‌ రూ.2.80కే సప్లై చేయడానికి ఎన్టీపీసీ, సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్ ముందుకొచ్చాయి. గతంలో కమీషన్లకు కక్కుర్తిపడి చంద్రబాబు నాయుడు.. యూనిట్‌ రూ.5 చొప్పున ప్రైవేట్‌ సంస్థలతో పీపీఏలు కుదుర్చుకుని రాష్ట్రంపై పెను భారం మోపాడు. అందుకే వాటి నిగ్గు తేల్చాలని సీఎం జగన్ గారు పట్టుబట్టారు' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
Andhra Pradesh
YSRCP
Telugudesam

More Telugu News