Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • నయనతార బాలీవుడ్ ఎంట్రీ!
  • థాయిలాండ్ అడవుల్లో బన్నీ షూటింగ్ 
  • త్రివిక్రమ్ తో మరోసారి ఎన్టీఆర్  

   *  దక్షిణాది భాషల్లో కథానాయికగా అగ్రస్థానంలో కొనసాగుతున్న నయనతార తొలిసారిగా ఓ హిందీ చిత్రంలో నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ఆమెను హిందీ చిత్రసీమకు పరిచయం చేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం రజనీకాంత్ సరసన 'దర్బార్' చిత్రంలో నయనతార నటిస్తోంది.
*  అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న మూడవ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ భాగం షూటింగును థాయిలాండ్ లోని దట్టమైన అడవుల్లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో మరో సినిమా రానుంది. ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని చేస్తున్న త్రివిక్రమ్ ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజక్టుకు సంబంధించి ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయట.    

More Telugu News