Laxmi parvathi: దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు

  • ఆయనేమీ తక్కువోడు కాదు
  • నాపై అసత్యాలు ప్రచారం చేశాడు
  • ఎన్టీఆర్ పదవి ఇస్తానన్నా అడ్డుకున్నాడు
ఎన్టీరామారావు పెద్దల్లుడు, వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు. ఆయనేమీ తక్కువోడు కాదని, చాలా చేశాడని అన్నారు. తనపై అసత్యాలు ప్రచారం చేయడంలో ఆయన పాత్ర కూడా ఉందని అన్నారు. ఎన్టీఆర్ తనకు పదవి ఇస్తానన్నా రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.

 ఇక, చంద్రబాబును నమ్మే పరిస్థితి ఆ పార్టీ నేతల్లో లేదని లక్ష్మీపార్వతి తేల్చి చెప్పారు. కుక్కమూతి పిందెకు ఏం తెలుసని పెద్ద నేతను చేశారని లోకేశ్‌ను ఉద్దేశించి విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి చివరి రోజులు నడుస్తున్నాయని, నేడు ఆ పార్టీ దౌర్భాగ్య స్థితిలో ఉందని అన్నారు. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు అనుకూల మీడియాలో తనపై వ్యతిరేక వార్తలు రాయించారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. తెలుగు అకాడమీ చైర్ పర్సన్‌గా నియమితులైన తర్వాత ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Laxmi parvathi
YSRCP
Daggubati venkateshwara rao

More Telugu News