Nagarjuna: రేఖ గారు కాలాతీత సౌందర్యరాశి: నాగార్జున

  • హైదరాబాద్ లో ఏఎన్నార్ నేషనల్ అవార్డుల కార్యక్రమం
  • హాజరైన చిరంజీవి, రేఖ, బోనీ కపూర్ తదితరులు
  • అలరించిన నాగార్జున
అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్ లో నిర్వహించారు. దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్ ను ఏలిన రేఖ, శ్రీదేవిలకు ఏఎన్నార్ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రేఖ, బోనీకపూర్ తదితరులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో నటుడు నాగార్జున మాట్లాడుతూ, రేఖను పొగడ్తల్లో ముంచేశారు. రేఖ కాలంతో పనిలేని అందగత్తె అని అభివర్ణించారు. రేఖ వెండితెరకు పరిచయం అయింది రంగులరాట్నం అనే తెలుగుచిత్రంతోనే అని వెల్లడించారు.  మీరింత అందంగా ఎలా ఉంటారండీ అని నాగ్ ప్రశ్నించగా, ఆమె సిగ్గుల మొగ్గయింది. అందం, అభినయం, గొప్ప వ్యక్తిత్వం కలగలిస్తే రేఖ అని కొనియాడారు.
Nagarjuna
ANR
Rekha
Tollywood
Bollywood

More Telugu News