Tirumala: తిరుమల లడ్డూ ధర పెంపు నిర్ణయం వెనక్కు!

  • గత వారంలో ధర పెంచాలని టీటీడీ నిర్ణయం
  • భక్తుల నుంచి తీవ్ర విమర్శలు
  • ధరను పెంచడం లేదని స్పష్టం చేసిన వైవీ సుబ్బారెడ్డి
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దివ్య ప్రసాదమైన లడ్డూ ధరను పెంచబోవడం లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. నేడు తమిళనాడులో పర్యటిస్తున్న ఆయన, చెన్నైలో మీడియాతో మాట్లాడారు. లడ్డూ ధరను సవరించడం లేదని, ప్రస్తుతం కొనసాగుతున్న విధానంలోనే లడ్డూల విక్రయాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. కాగా, గత వారంలో టీటీడీ అధికారులు సమావేశమై, ప్రస్తుతం రూ. 25గా ఉన్న లడ్డూ ధరను రూ. 50కి పెంచాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ధర పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.
Tirumala
Ladoo
Price
TTD
YV Subba Reddy

More Telugu News