Varun: పునర్నవి గ్యాంగ్ పార్టీ... రాహుల్ సిప్లిగంజ్ డుమ్మా!

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ బిగ్ బాస్ మూడవ సీజన్ ముగిసి రెండు వారాలు గడిచినా, హౌస్ లో కంటెస్టెంట్స్ గా గడిపి బయటకు వచ్చిన వారు ఇంకా పార్టీ మూడ్ నుంచి బయటకు రాలేదు. హౌస్ లో ఫేమస్ అయిన వారంతా రోజూ ఎక్కడో ఒకచోట పార్టీ చేసుకుంటున్నారు. తాజాగా పునర్నవి, వరుణ్, వితిక తదితరులు పార్టీ చేసుకోగా, దానికి పునర్నవి బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ డుమ్మా కొట్టాడు. ఈ విషయాన్ని స్వయంగా చెప్పిన పునర్నవి, పార్టీని ఎంజాయ్ చేసినా, మనసులో వెలితిగా ఉందని, మిస్ యూ రాహుల్ అని సోషల్ మీడియాలో కామెంట్ పెట్టింది. హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయిన రాహుల్, పునర్నవి లవ్ లో ఉన్నారన్న రూమర్స్ ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వారిద్దరూ తాము స్నేహితులమేనని చెప్పినప్పటికీ, వీరికి పెళ్లి జరగబోతోందన్న వార్తలు మాత్రం ఆగడంలేదు.
Go Back to Shorts
Varun
Vithika
Rahul Sipliganj
Punarnavi

More Telugu News