praliament: పార్లమెంటు సమావేశాలపై అఖిలపక్ష భేటీ
- ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో సమావేశం
- రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
- సమావేశాల నిర్వహణపై చర్చ
రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలపై అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో పార్లమెంటు లైబ్రరీ భవన్ లో జరుగుతోన్న ఈ భేటీలో రేపటి నుంచి జరగనున్న సమావేశాల నిర్వహణపై చర్చిస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను ప్రహ్లాద్ జోషి వివరిస్తున్నారు.
కాగా, అఖిలపక్ష సమావేశం అనంతరం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీపీ సమావేశం జరగనుంది. ఆ తర్వాత 3 గంటలకు ఎన్డీయే పక్షాల భేటీ, 4 గంటలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతుంది.