Muslim Personal Law Board: అయోధ్య తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు భేటీ.. హాజరైన అసదుద్దీన్ ఒవైసీ

  • లక్నోలో కొనసాగుతోన్న సమావేశం
  • ముస్లింలకు అయోధ్యలో 5 ఎకరాల స్థలం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు
  • అయోధ్య తీర్పు నేపథ్యంలో కీలక భేటీ
ఇటీవల అయోధ్య కేసులో తుది తీర్పు వెల్లడైన విషయం తెలిసిందే. అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చి, ముస్లింలకు అయోధ్యలో 5 ఎకరాల స్థలం ఇవ్వాలని కూడా పేర్కొంది. ఈ తీర్పుపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి ఈ రోజు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) సమావేశమైంది.

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లక్నో చేరుకొని, ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా, ఈ తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తిగా ఉందని ఇటీవల ఒవైసీ తెలిపిన విషయం తెలిసిందే. తాము పోరాడింది 5 ఎకరాల భూమి కోసం కాదని, న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రివ్యూ పిటిషన్ వేయాలా? అనే విషయాన్ని పర్సనల్ లా బోర్డు నిర్ణయిస్తుందని ఆయన ఇటీవల చెప్పారు.

Muslim Personal Law Board
Supreme Court
Ayodhya
Asaduddin Owaisi

More Telugu News