నేడు పదవీ విరమణ... తిరుమలలోనే ఉన్న సీజే రంజన్ గొగోయ్!
- నిన్న తిరుమలకు వచ్చిన సీజే
- నేడు కూడా స్వామి దర్శనం
- చివరి పనిదినాన తిరుమలలో రంజన్ గొగోయ్
ఇటీవలి కాలంలో పలు కీలక తీర్పులను ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. అయోధ్య, రాఫెల్, శబరిమలకు మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లు, 'చౌకీ దార్ చోర్ హై' అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన తన తీర్పులను వెల్లడించారు. తన చివరి పనిదినాన్ని సైతం గొగోయ్, తిరుమలలోనే గడపడం గమనార్హం.