Supreme Court: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్

  • శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొన్న గొగొయ్ దంపతులు
  • స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయం అదనపు ఈవో ధర్మారెడ్డి
  • అంతకు ముందు తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ దంపతులు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ దంపతులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత గొగొయ్ దంపతులు శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొన్నారు. ఆలయంలో అదనపు ఈవో ధర్మారెడ్డి వీరికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం, రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. రేపు ఉదయం కూడా రంజన్ గొగొయ్ దంపతులు మరోసారి స్వామివారి సేవలో పాల్గొననున్నారు. అంతకు ముందు దంపతులు తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
Supreme Court
CJI Ranjan Gogai
visit To Tirumala And Tirupathi

More Telugu News