లోకేశ్ ను అన్నా, అన్నా అని పిలిచి ఆయనపైనే విమర్శలు చేస్తున్నారు: వర్ల రామయ్య
- హైందవ ధర్మాన్ని అగౌరవపర్చుతున్నారని మండిపాటు
- అయ్యప్ప మాల వేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతారా?
- దీక్ష చేపట్టినవాళ్లు నియంత్రణలో ఉండాలని హితవు
జగన్ తో కలిసి తప్పుడుగా మాట్లాడడం వంశీకి సరికాదని అన్నారు. అయ్యప్పమాల వేసుకుని అనకూడని మాటలు అనడం, కాళ్లకు చెప్పులు వేసుకోవడం హైందవ ధర్మాన్ని అగౌరవపర్చడేమనని అభిప్రాయపడ్డారు. వంశీ మనసును నియంత్రించుకోలేక, ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అయ్యప్పమాల వేసుకున్న వ్యక్తులు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలని హితవు పలికారు.