NTR: ఎన్టీఆర్ హయాం నుంచి పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తున్నాం... అందుకే జీవో 938, 2430కి వ్యతిరేకంగా పోరాడుతున్నాం: చంద్రబాబు

  • నేడు జాతీయ పత్రికా దినోత్సవం
  • మీడియా సంస్థల అధినేతలకు చంద్రబాబు శుభాకాంక్షలు
  • జీవో 2430ని రద్దు చేయాలంటూ వైసీపీ సర్కారుకు హితవు
నేడు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా వివిధ మీడియా సంస్థల అధినేతలకు, పాత్రికేయులకు, పత్రికా రంగంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు.  భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణలో, భారతీయుల ఆకాంక్షలను ప్రతిఫలింపజేయడంలో పత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాలు బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు.

ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీ పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తోందని, అందుకే తాము జీవో 938, జీవో 2430కి వ్యతిరేకంగా పోరాడుతున్నామని స్పష్టం చేశారు. స్వేచ్ఛగా, నిర్భయంగా తమ విధులను నిర్వర్తించే పత్రికలను కట్టడి చేసేందుకు తీసుకువచ్చిన జీవో 2430ని రద్దు చేసి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షించాలని పత్రికా దినోత్సవం సందర్భంగా వైసీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.
NTR
Telugudesam
Telugudesam
Chandrababu
Jagan
Andhra Pradesh
Media
National Press Day
YSRCP

More Telugu News