Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు పక్కన పెట్టడానికి కారణం ఇదే: కొడాలి నాని

  • లోకేశ్ కు ఇబ్బంది అవుతుందనే ఎన్టీఆర్ ను పక్కన పెట్టారు
  • లోకేశ్ ది కార్పొరేటర్ స్థాయి కూడా కాదు
  • దివంగత ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయనే భావనతో 2009 ఎన్నికల్లో ఆయన చేత చంద్రబాబు ప్రచారం చేయించారని ఏపీ మంత్రి కొడాలి నాని తెలిపారు. అయితే తన కుమారుడు లోకేశ్ కు ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో ఆ తర్వాత ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారని చెప్పారు.

వాస్తవానికి లోకేశ్ ది కార్పొరేటర్ స్థాయి కూడా కాదని ఎద్దేవా చేశారు. కుమారుడు అయినందువల్లే లోకేశ్ ని ఎమ్మెల్సీ చేసి, మంత్రి పదవిని కట్టబెట్టారని చెప్పారు. టీడీపీకి లోకేశ్ గుదిబండగా మారారని అన్నారు. దివంగత ఎన్టీఆర్ గొప్ప నాయకుడని, చంద్రబాబులా ఆయన ఏనాడూ సొల్లు కబుర్లు చెప్పలేదని తెలిపారు. నక్క వినయాలు ప్రదర్శిస్తూ ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.
Junior NTR
Nara Lokesh
Chandrababu
Kodali Nani

More Telugu News