Mahesh Babu: 'సరిలేరు నీకెవ్వరు' నుంచి టీజర్ లోడింగ్!

  • ముగింపు దశలో 'సరిలేరు నీకెవ్వరు'
  • ఆర్మీ ఆఫీసర్ పాత్రలో మహేశ్ బాబు 
  • జనవరి 12వ తేదీన విడుదల  
మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమాకి 'దిల్' రాజు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఆయన బ్యానర్ నుంచి, 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ లోడింగ్ అంటూ ఆర్మీ ఆఫీసర్ గా మహేశ్ బాబు 'గన్' లోడ్ చేస్తున్న ఒక 'గిఫీ' వీడియోను వదిలారు. త్వరలో టీజర్ ను వదలనున్నట్టుగా సంకేతాన్నిచ్చారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, విజయశాంతి .. ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.
Mahesh Babu
Rashmika Mandanaa

More Telugu News