బాపట్ల తీరంలో కనిపించిన ప్రపంచంలోనే అరుదైన నీటి పిల్లి.. నీటి కుక్క!
- నీటి పిల్లి, నీటి కుక్క సంరక్షణకు నడుంబిగించిన అటవీ అధికారులు
- రూ.5.80 కోట్లు కేటాయించాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు
- మడ అడవులు, చిత్తడి నేలల సంరక్షణకు అధికారుల ప్రణాళికలు
ఇప్పుడు వీటితోపాటు అరుదైన జంతు జాతుల సంరక్షణపైనా దృష్టి సారించనున్నారు. తాజాగా, అటవీ ప్రాంతంలో ఉన్న నీటి పిల్లులు, నీటి కుక్కలను గుర్తించేందుకు అడవిలో కెమెరాలు ఏర్పాటు చేశారు. సముద్ర తీర ప్రాంతంలో తాటి, సరుగుడు చెట్లను పెంచడం ద్వారా చిత్తడి నేలను సంరక్షిస్తారు. తద్వారా చేపలు వృద్ధి చెందుతాయని, ఫలితంగా నీటి పిల్లి, కుక్కలకు ఆహారం సమృద్ధిగా లభిస్తుందని పేర్కొన్నారు. కాగా, నీటి పిల్లి రాత్రివేళ మాత్రమే ఆహారం కోసం సంచరిస్తుంది.