చంద్రబాబు పటపటా నూరితే ముసలిపళ్లు ఊడిపోతాయి: వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై స్పందించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "నేను రాజీనామా చేస్తానన్నాను. లోకేశ్ ను విమర్శించాను. వాళ్లకు ఇంకా ఆప్షన్ ఏముంది? చంద్రబాబునాయుడు ఇంకేమి చేయగలడు? పళ్లు పటపటా నూరతాడా? ముసలిపళ్లు ఊడిపోతాయి. ఇక్కడిదాకా సౌండొస్తుందా? ఏం చేస్తాడు చంద్రబాబునాయుడు? చంద్రబాబునాయుడు తోక కత్తిరింపులు, బెదిరింపులు, హూంకరింపులు, కాళ్లు పట్టుకోవడాలు ఎప్పుడో చూసేశాము. ఎలక్షన్ల ముందు మోదీ, అమిత్ షాను ఎన్ని తిట్టాడు? ఎలక్షన్లు అయిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు?" అంటూ బాబును విమర్శించారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Vallabhaneni Vamsi
mla

More Telugu News