Chiranjeevi: తీవ్ర ఇబ్బందుల్లో సాయం కోసం ఎదురుచూస్తోన్న.. ‘పునాదిరాళ్లు’ దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్‌!

షార్ట్స్‌లో చూడండి
సినీనటుడు చిరంజీవి నటించిన మొదటి చిత్రం ‘పునాదిరాళ్లు’ దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్‌ (75) ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆయన దర్శకుడిగానే కాదు సినిమా నిర్మాతగా, దర్శకుడిగా, కథ, పాటల రచయితగానూ పని చేశారు. అయినప్పటికీ ఆయనకు ఇప్పటికీ హైదరాబాద్ లో సొంతిల్లు కూడా లేదు. అద్దె ఇంట్లోనే ఆయన ఉంటున్నారు.

రెండు నెలల క్రితం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.  రక్తపు విరేచనాలు, గుండెకు వేసిన రెండు స్టంట్‌లతో ఇబ్బంది పడతున్నారు. ప్రస్తుతం ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వైద్య ఖర్చులకు కూడా స్తొమత లేక అల్లాడిపోతున్నారు. ఆయన కుమారుడు కొన్నేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. అనంతరం కొన్ని రోజులకే ఆయన భార్య  కూడా మరణించారు. అనారోగ్యంతో మంచానికే పరిమితమై వైద్యం కోసం సాయం అందిచే వారి కోసం ఎదురు చూస్తున్నారు.
Go Back to Shorts
Chiranjeevi
Andhra Pradesh
Hyderabad

More Telugu News