lathamaneskar: లతామంగేష్కర్ కోలుకుంటున్నారు: కుటుంబ సభ్యులు

షార్ట్స్‌లో చూడండి

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నేపథ్య గాయని లతామంగేష్కర్ కోలుకుంటున్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావడంతో ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ లో ఆమెకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.


 అయితే ఆమె ఆరోగ్యం విషయంలో పలు పుకార్లు షికారు చేస్తుండడంతో కుటుంబ సభ్యులు స్పందించారు. లత కోలుకుంటున్నారని, ఆధారాల్లేని పుకార్లు సృష్టించవద్దని అందరినీ వేడుకున్నారు. ఆమెపై ప్రేమాభిమానాలు చూపుతున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు.

Go Back to Shorts
lathamaneskar
mumbai
breach kandi hoospital

More Telugu News