Pushpa Srivani: ఇంగ్లీష్ రాకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నా: ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

  • ఇంగ్లీష్ రాకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది
  • దానికి నేనే ఒక ఉదాహరణ
  • డిగ్రీ ఇంగ్లీష్ లో చదివినా భాషపై పట్టు సాధించలేకపోయా
ఇంగ్లీష్ రాకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని... దానికి తానే ఒక ఉదాహరణ అని ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన తాను... ఇంగ్లీష్ మీడియంలో మూడు నెలలు ఇంటర్ చదివానని, ఆ తర్వాత చదవలేక మళ్లీ తెలుగు మీడియంలో చేరానని చెప్పారు.

ఇక డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పటికీ ఆ భాషపై పట్టు సాధించలేకపోయానని తెలిపారు. ఇంగ్లీష్ రాకపోవడంతో ఇప్పుడెంతో ఇబ్బంది పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి విద్యార్థులకు అలాంటి ఇబ్బంది రాకూడదనే... ఇంగ్లీష్ మీడియంను అమలు చేస్తున్నామని చెప్పారు. బూసరాజుపల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన 'మన బడి నాడు-నేడు' కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆమె పైవ్యాఖ్యలు చేశారు.
Pushpa Srivani
Andhra Pradesh
YSRCP
English

More Telugu News