శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య కుదిరిన ఒప్పందం.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం!
- శివసేనకు సీఎం, ఎన్సీపీ, కాంగ్రెస్ లకు డిప్యూటీ సీఎం పదవులు
- ఒప్పందానికి సోనియా, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే అంగీకారం
- ఈ నెల 17న ప్రభుత్వ ఏర్పాటు?
శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా శివసేనకు సీఎం పదవి సహా 14 మంత్రి పదవులు, ఎన్సీపీకి డిప్యూటీ సీఎం సహా 14 మంత్రి పదవులు, కాంగ్రెస్కు డిప్యూటీ సీఎం సహా 12 మంత్రి పదవులు దక్కనున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం ఈ నెల 17న ఏర్పడనుందని ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న విషయం తెలిసిందే.