Telugudesam: కాసేపట్లో టీడీపీ కీలక సమావేశం.. తాజా పరిణామాలపై చర్చించనున్న చంద్రబాబు

  • ఇసుక దీక్ష, పార్టీ తదుపరి కార్యాచరణపై వ్యూహం
  • పార్టీ నుంచి వలసల పైనా చర్చించే అవకాశం
  • పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై సమాలోచన

తెలుగుదేశం పార్టీలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కీలక రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఇసుక కొరతపై పార్టీ పరంగా చేస్తున్న పోరాటాలు, నిన్న విజయవాడలో చేసిన దీక్ష, తదనంతర పరిణామాలపై చర్చించనున్నారు. 


అలాగే, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాశ్ పార్టీ వీడిన అంశం, బీజేపీ నాయకులతో గంటా భేటీ తదితర రాజకీయ పరిణామాలపైనా చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో త్వరలో పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా పార్టీ నేతలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

Telugudesam
Chandrababu
Amaravathi

More Telugu News