కాళేశ్వరం ప్రాజక్టుకు జాతీయ హోదా కల్పించొద్దు: సుప్రీంకు ఏపీ విజ్ఞప్తి
- ఏపీ రైతుల ప్రయోజనాలకు కాళేశ్వరం ప్రాజెక్టు విరుద్ధం
- పోలవరం విషయంలో అభ్యంతరాలు చెప్పే హక్కును తెలంగాణ కోల్పోయింది
- తెలంగాణను పార్టీగా పరిగణించాల్సిన పనిలేదు
అఫిడవిట్‌లోని అంశాలను పరిశీలించి విభజన చట్టంలోని హామీలను త్వరగా అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. అలాగే, పిటిషనర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలని అభ్యర్థించింది. విభజన హామీల అమలులో జాప్యం జరుగుతోందంటూ తెలంగాణకు చెందిన బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి ప్రతిగా తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడు దీనిపై ఏపీ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.