NIMS: అర్హతలున్నా ప్రమోషన్ ఇవ్వరా? అంటూ నిమ్స్ లో నర్స్ ఆత్మహత్యా యత్నం

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో నిర్మల అనే నర్స్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ప్రమోషన్ విషయంలో తనకు అన్యాయం చేస్తున్నారని నిరసిస్తూ గొంతుకోసుకుంది. తీవ్రంగా గాయపడ్డ అమెకు మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ ఇతర వైద్యుల తోడ్పాటుతో చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు వివరాలను ఆస్పత్రి సిబ్బంది మీడియాకు తెలిపారు.

నిర్మల ఆస్పత్రిలోని స్టోర్స్ లో పనిచేస్తోందని, గత కొంతకాలంగా తనకు అర్హత ఉన్నప్పటికీ ప్రమోషన్ ఇవ్వకుండా పై అధికారులు అన్యాయం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారని వారు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం ఆమె ఆస్పత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణ, ఆస్పత్రి డైరెక్టర్ మనోహర్ లను కలిసేందుకు వారి ఛాంబర్ల వద్దకు వెళ్లగా.. వారు భోజనం చేస్తున్నారని అక్కడి సిబ్బంది చెప్పారన్నారు. దీంతో ఆమె నైరాశ్యంతో వెంట తెచ్చుకున్న ఆపరేషన్ బ్లేడ్ తో గొంతుకోసుకున్నారని వివరించారు.
Go Back to Shorts
NIMS
Hyderabad
nurse Nirmala
Suicide attempt

More Telugu News