Andhra Pradesh: కుటుంబ సంపద పెంచుకునేందుకే జగన్ రాష్ట్రాన్ని వాడుకుంటున్నారు: టీడీపీ ఎంపీ కేశినేని నాని

  • ఇసుకను బ్లాక్ మార్కెట్ చేయడం కోసమే ఇసుక కొరతను సృష్టించారు
  • ప్రజావేదిక కూల్చకుండా ఉంటే కోట్ల రూపాయలు ఆదా అయ్యేవి
  • ఏడు మండలాలను ఏపీలో కలపడానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారు
సీఎం జగన్ విధానాలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుటుంబ సంపద పెంచుకునేందుకు జగన్ రాష్ట్రాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆయన పూర్తి చేయలేరని వ్యాఖ్యానించారు. ఇసుకను బ్లాక్ మార్కెట్ చేయడం కోసమే రాష్ట్రంలో ఇసుక కొరతను సృష్టించారన్నారు. భవన నిర్మాణరంగ కార్మికులు పనిలేక కష్టాలు పడుతున్నారని అన్నారు.

విజయవాడలో ప్రజావేదిక కూల్చకుండా ఉంటే కోట్ల రూపాయలు ఆదా అయ్యేవని పేర్కొన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలపడానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. జగన్ పాలన తుగ్లక్ పరిపాలనను తలపిస్తోందని కేశినేని విమర్శించారు.
Andhra Pradesh
Telugudesam MP Kesineni Nani
Criticism on Jagan

More Telugu News