ఆ తర్వాత ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ కనబడ్డాడా? ఆయన్ని ఎవరు ఆపేశారు?: వల్లభనేని వంశీ
- 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు
- ఆ తర్వాత ఎప్పుడైనా కనబడ్డాడా?
- అందుకు కారణమేంటి?
ఉదాహరణకు 2004లో 47 సీట్లకే పరిమితమయ్యామని, 2009లో ఏటీఎం కార్డులు పంచామని, అప్పుడు 90 సీట్లు రావడంతో ప్రతిపక్షంగానే మిగిలిపోయామని అన్నారు. 2009 ఎన్నికల్లో హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారని, ఆ తర్వాత ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ కనబడ్డాడా? అందుకు కారణమేంటి? ఎవరు ఆపేశారు ఆయన్ని? పది సంవత్సరాల క్రితం తన కెరీర్ ని జూనియర్ ఎన్టీఆర్ పణంగా పెట్టి టీడీపీ కోసం ప్రచారం చేసిన ఆయన ఎందుకు కనబడలేదు? ఎందుకు నల్లపూస అయిపోయాడు? అని ప్రశ్నించారు.