Roja Ramani: ఎన్టీఆర్ ను చూడగానే మా నిద్రమత్తు ఎగిరిపోయింది: సీనియర్ నటి రోజా రమణి

  • అది 'డ్రైవర్ రాముడు' సినిమా షూటింగ్ 
  • పాట చిత్రీకరణ నిమ్మకూరులో జరిగింది 
  • మా అందరికంటే ముందుగానే ఎన్టీఆర్ వచ్చారన్న రోజా రమణి
తాజా ఇంటర్వ్యూలో రోజా రమణి మాట్లాడుతూ, పాత రోజుల నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. 'డ్రైవర్ రాముడు' సినిమా కోసం 'ఏమని వర్ణించను' పాటను నిమ్మకూరులోని రామారావుగారి ఇంట్లో ప్లాన్ చేశారు. షూటింగుకి ముందురోజున మేమంతా విజయవాడ చేరుకున్నాము. అక్కడి నుంచి ఎవరి కార్లలో వాళ్లు బయల్దేరితే కమ్యూనికేషన్ పరంగా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఏసీ బస్సులోనే అంతా కలిసి బయలుదేరాలి అని చెప్పారు.

ఉదయం 8 గంటలకి బస్సు వస్తుందనీ, అంతా సిద్ధమైపోవాలని అన్నారు. మరుసటి రోజు ఉదయం మేమంతా నెమ్మదిగా నిద్రలేచి .. మేకప్ కిట్లు సర్దుకుంటున్నాము. అంతలో మేనేజర్ వచ్చి 'బయల్దేరండి బస్సు వచ్చింది' అన్నాడు. 'అబ్బా వస్తున్నాం వుండండి' అంటూ మేము బయటికి వచ్చాము. బస్సు లోపల రామారావుగారు కూర్చుని వున్నారు. ఆయనను చూడగానే మా నిద్రమత్తు ఎగిరిపోయింది. అంతే అందరం లోపలికి పరుగెత్తుకెళ్లి చకచకా రెడీ అయ్యాము. రామారావుగారి క్రమశిక్షణకు ఇదో నిదర్శనం" అని చెప్పుకొచ్చారు.
Roja Ramani
Ntr

More Telugu News