'దర్బార్'కి డబ్బింగ్ మొదలెట్టేసిన రజనీ
- పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజనీ
- కీలకమైన పాత్రలో సునీల్ శెట్టి
- జనవరి 10వ తేదీన విడుదల
ప్రస్తుతం రజనీకాంత్ తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో ఆయన ముంబైలోని సౌత్ జోన్ కి చెందిన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇంతకుముందు రజనీ పోలీస్ ఆఫీసర్స్ పాత్రలు చేసినా, ఈ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. రజనీ సరసన నాయికగా నయనతార నటించిన ఈ సినిమాలో, నివేదా థామస్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. సునీల్ శెట్టి పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.