Roja Ramani: హిరణ్యకశిపుడిగా రానా బాగుంటాడు: రోజా రమణి

  • 'బాహుబలి'తో రానా మెప్పించాడు 
  • ఆయన వాయిస్ కూడా బాగుంటుంది 
  • హిరణ్యకశిపుడిగా బాగా చేస్తాడన్న రోజా రమణి 
'భక్త ప్రహ్లాద' సినిమా చూసినవాళ్లు, ఆ పాత్రను చేసిన రోజా రమణిని ఇప్పటికీ మరిచిపోలేరు. హిరణ్యకశిపుడి పాత్రధారి అయిన ఎస్వీ రంగారావుతో కలిసి నటించిన ఆ సినిమా ఆమె కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు అదే కంటెంట్ తో హిరణ్యకశిపుడి కోణంలో గుణశేఖర్ ఒక సినిమా చేస్తున్నాడు.

రానా ప్రధాన పాత్రధారిగా చేయనున్న 'హిరణ్యకశిప' సినిమాపై తాజా ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. "రానా మంచి హైటూ .. పర్సనాలిటీ వున్న వ్యక్తి. 'బాహుబలి' సినిమాలో తన ఫిజిక్ తోను .. నటనతోను ఆయన ఆకట్టుకున్నాడు. ఆయన వాయిస్ కూడా బాగుంటుంది. ఎస్వీఆర్ తో పోల్చడం కరెక్ట్ కాదుగానీ, హిరణ్యకశిపుడి పాత్రకి రానా చాలా కరెక్టుగా సెట్ అవుతాడు .. బాగా చేస్తాడనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చారు.
Roja Ramani
Rana

More Telugu News