kurnool: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిచిపోయిన గుండె శస్త్రచికిత్సలు!

  • రెండు వారాలుగా జరగని శస్త్ర చికిత్సలు  
  • సిబ్బందికి జీతాలు అందని వైనం
  • విధులకు హాజరు కాని ఫర్ ఫ్యూజనిస్ట్ గౌస్ బాషా  
కర్నూలు సర్వజన ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్సలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఫర్ ఫ్యూజనిస్ట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ లేకపోవడంతో రెండు వారాలుగా శస్త్ర చికిత్సలు నిలిచిపోయినట్టు సమాచారం. జీతాలు అందకపోవడంతో ఫర్ ఫ్యూజనిస్ట్ గౌస్ బాషా తన విధులకు హాజరు కాలేదని, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ను బదిలీ చేశారని సంబంధిత వర్గాల సమాచారం. ఆరోగ్యశ్రీ సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదని తెలుస్తోంది. ఈ సమస్యలను ఆసుపత్రి సూపరింటెండెంట్ పట్టించుకోవడం లేదని శస్త్ర చికిత్సల కోసం ఎదురు చూస్తున్న హృద్రోగులు ఆరోపిస్తున్నారు.
kurnool
Government Hopital
Aarogyasir
salaries

More Telugu News