Telugudesam: నాపై ఆరోపణలకు చంద్రబాబు ఆధారాలు చూపకపోతే నేనూ దీక్షకు దిగుతా: వైసీపీ నేత పార్థసారథి

  • ఇసుక కృత్రిమ కొరతకు నేను కారణమా?
  • అక్రమ రవాణాకు పాల్పడ్డానా?
  • నాపై చంద్రబాబు ఆరోపణలు తగదు
రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత, అక్రమ రవాణాకు కారణం వైసీపీ నేతలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తప్పుబట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలకు సాయంత్రంలోగా ఆధారాలు చూపించని పక్షంలో రేపు చంద్రబాబు దీక్ష పక్కనే తాను కూడా దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

‘నేను చంద్రబాబునాయుడుగారికి సవాల్ చేస్తున్నాను. నేను ఏవిధంగా ఇసుక కృత్రిమ కొరతకు కారణమో, అక్రమ రవాణా చేశానో ఆధారాలు చూపించకపోతే, రేపు అదే ధర్నా చౌక్ లో నేను కూడా చంద్రబాబు నాయుడుగారి దగుల్బాజీ రాజకీయాలకు వ్యతిరేకంగా ధర్నా చేయబోతున్నా. పోలీస్ పర్మిషన్ కోసం అప్లయ్ చేయబోతున్నా’ అని చెప్పుకొచ్చారు.
Telugudesam
Chandrababu
YSRCP
partha Sarathi

More Telugu News