Chandrababu: చంద్రబాబు, లోకేశ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: బొత్స సత్యనారాయణ

  • పెట్టుబడులు వెళ్లిపోతున్నాయంటూ ప్రచారం చేస్తున్నారు
  • అమరావతి స్టార్టప్ ఏరియాపై సింగపూర్ సంస్థలతో చర్చించాం
  • ప్రాజెక్ట్ వల్ల కలిగే ప్రయోజనాలను వారు చెప్పలేకపోయారు
రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెళ్లిపోతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతి స్టార్టప్ ఏరియాపై గతంలో సింగపూర్ సంస్థలతో చర్చించామని... ప్రాజెక్ట్ వల్ల కలిగే ప్రయోజనాలను వారు సరిగా చెప్పలేకపోయారని తెలిపారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారని చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబు, లోకేశ్ వైఖరిని తప్పుబడుతున్నామని తెలిపారు. లోకేశ్ నేరుగా మాట్లాడలేరని... ట్విట్టర్లో ఏదో ఒకటి చెబుతారని అన్నారు.
Chandrababu
Nara Lokesh
Botsa Satyanarayana
Telugudesam
YSRCP

More Telugu News