Actress Manvi Gagru: ఆడిషన్స్ లో రేప్ సీన్ లో పాల్గొనమన్నారు.. పారిపోయా: బాలీవుడ్ నటి మాన్వి

  • ఆడిషన్స్ తీసుకునే గది ఆఫీస్ లాగా లేదన్న నటి
  • పడక మంచం మాత్రమే ఉంది
  • ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.. భయమేసింది..  బయటకు పరుగుతీశా
బాలీవుడ్ లో అవకాశాలకోసం ప్రయత్నిస్తున్న సమయంలో తాను ఎదుర్కొన్న ఆడిషన్స్ లో అనుకోని సన్నివేశంలో నటించమని అన్నారని నటి మాన్వి గాగ్రూ తెలిపింది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, అప్పటి ఘటనను ప్రస్తావించింది.

‘ఓ సినిమాలో అవకాశం కోసం ఆడిషన్స్ కు వెళ్లాను. చెత్తగా ఉన్న ఓ ఆఫీసులో నన్ను అత్యాచారం యత్నం సన్నివేశంలో నటించమని కోరారు. అది ఆఫీసులాగా లేదు. గదిలో పడక మంచం మాత్రమే ఉంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితి చూసి నేను భయంతో వెనక్కి చూడకుండా బయటకు పరుగుతీశా’ అని చెప్పింది.

 మాన్వి ‘ఉజ్జా చమన్’ చిత్రంలో నటించి గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఎక్కువ బరువు, లావుగా ఉన్న అమ్మాయిగా కనిపించిన మాన్వి బట్టతల ఉన్న హీరోను ఇష్టపడే అమ్మాయిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సన్నీసింగ్ హీరోగా నటించిన ఈ సినిమాకు అభిషేక్ పాథక్ దర్శకత్వం వహించారు.
Actress Manvi Gagru
Bollywood
Auditons
Rape seen

More Telugu News