somuveerraju: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల్ని ఏపీ ప్రజలు విశ్వసించరు!: బీజేపీ నాయకుడు సోము వీర్రాజు

  • త్వరలోనే టీడీపీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండరు
  • ఇప్పటికే విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా సంప్రదించారు
  • త్వరలోనే అందరినీ పార్టీలో కలుపుకొంటాం

బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎప్పటిలాగే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఎన్ని చేసినా చంద్రబాబు మాటలను ఏపీ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. ఈరోజు విశాఖలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ త్వరలోనే ఖాళీ అయిపోనున్నదని జోస్యం చెప్పారు. ఇప్పటికే విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తమను సంప్రదించారని, మిగిలిన వారు కూడా ఆయన బాటలోనే ప్రయాణించనున్నారని తెలిపారు. త్వరలో అధిష్ఠానం పెద్దలతో మాట్లాడి టీడీపీ ఎమ్మెల్యేలందరినీ తమ పార్టీలో కలుపుకుంటామని తెలిపారు. ఆ సెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్యం లేని పరిస్థితి వస్తుందన్నారు.

somuveerraju
Chandrababu
Telugudesam
BJP
visakhapatnam

More Telugu News