Nara Lokesh: జగన్ గారి ఇసుకాసుర లీలలు బయటపడ్డాయి: నారా లోకేశ్

  • వైకాపా ఇసుక దొంగలు అడ్డంగా దొరికారు
  • 5 నెలల్లో 42 మంది భవన నిర్మాణ కార్మికులని పొట్టనబెట్టుకున్నారు
  • ఈ పాపం వారిని ఊరికే వదలదు
భవన నిర్మాణ కార్మికుల నోటి దగ్గర కూడు లాక్కొని వైకాపా నేతలు అవినీతి కోటలు నిర్మిస్తున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఏపీలో నెలకొన్న 'ఇసుక కృత్రిమ కొరత-అక్రమ రవాణా'పై ఈ నెల 14న చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్ష నేపథ్యంలో విజయవాడలో విడుదల చేసిన 'ఇసుక అక్రమ రవాణా చరిత్ర'ను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

'వరద వలనే ఇసుక దొరకడం లేదు అంటూ చిలక పలుకులు పలుకుతున్న జగన్ గారు భవన నిర్మాణ కార్మికులకు క్షమాపణలు చెప్పాలి. సిమెంట్ కంపెనీల నుండి జే ట్యాక్స్ వసూలు అయ్యే వరకూ వరద కారణంగా ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతూనే ఉంటుంది. వైకాపా ఇసుక మాఫియా లిస్ట్ ర్యాంపుల దగ్గర క్యూ కట్టిన ట్రాక్టర్లలా పెరుగుతూనే ఉంది' అని విమర్శలు గుప్పించారు.

'వైఎస్ జగన్ గారి ఇసుకాసుర లీలలు బయటపడ్డాయి. వైకాపా ఇసుక దొంగలు అడ్డంగా దొరికారు. 5 నెలల్లో 42 మంది భవన నిర్మాణ కార్మికులని మింగేసిన పాపం వీరిని ఊరికే వదలదు' అని ట్వీట్ చేశారు.
Nara Lokesh
Telugudesam
Jagan

More Telugu News