'సరిలేరు నీకెవ్వరు'లోనూ హైలైట్ గా నిలిచే ఫ్రెండ్ రోల్
- ముగింపు దశలో 'సరిలేరు నీకెవ్వరు'
- ముఖ్యమైన పాత్రలో సత్యదేవ్
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
'జ్యోతిలక్ష్మి' సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్, ఆ తరువాత పలు చిత్రాలలో ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. ఆయన పాత్ర కారణంగానే 'సరిలేరు నీకెవ్వరు' కథ అనూహ్యమైన మలుపు తిరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాతో సత్యదేవ్ మరింత బిజీ అవుతాడనే టాక్ కూడా వినిపిస్తోంది. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి వుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.