sanjay: మహబూబాబాద్ డిపో డ్రైవర్ ఆత్మహత్య దిగ్భ్రాంతి కలిగించింది: ఎంపీ బండి సంజయ్

  • కార్మిక సమ్మె40వ రోజుకు చేరినా ప్రభుత్వం స్పందించట్లేదు
  • ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే కార్మికుల ఆత్మహత్యలు
  • కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దు
  • మీ ఉద్యమంలో వెన్నంటి ఉంటాం
టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె నేపథ్యంలో మహబూబాబాద్‌ డిపో డ్రైవర్‌ నరేష్‌ ఈ రోజు ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎంపీ బండి సంజయ్.. తెలంగాణ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. కార్మిక సమ్మె40వ రోజుకు చేరినా ప్రభుత్వం స్పందించక పోవడం విచారకరమని అన్నారు. మహబూబాబాద్ డిపో డ్రైవర్ ఆత్మహత్య దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని బండి సంజయ్ విమర్శించారు. కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని, వారి ఉద్యమంలో వెన్నంటి ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. 
sanjay
BJP
TRS

More Telugu News