Pawan Kalyan: మీరు ఇచ్చే సందేశం ఇదేనా 'నిత్య కల్యాణం'గారూ?: విజయసాయిరెడ్డి

  • ఇష్టమైతే ఎవరైనా ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చని పవన్ సలహా ఇస్తున్నారు
  • మీ పార్టీ కార్యకర్తలకు మీరిచ్చే సందేశం ఇదేనా?
  • వివాహ వ్యవస్థపై గౌరవం లేని వారు ప్రజా నాయకులు ఎప్పటికీ కాలేరు
ముగ్గురు పెళ్లాలు, నలుగురో లేదా ఐదుగురో పిల్లలు ఉన్న పవన్ కల్యాణ్ వారి పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించడం లేదా? అంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తన మూడు పెళ్లిళ్ల కారణంగానే మీరు రెండేళ్లు జైల్లో ఉన్నారా? అంటూ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో, పవన్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేముందని, ఇష్టమైతే ఎవరైనా ఎన్ని కళ్యాణాలైనా చేసుకోవచ్చని పవన్ సలహా ఇస్తున్నారని విజయసాయి మండిపడ్డారు. జనసేన పార్టీ కార్యకర్తలకు మీరిచ్చే సందేశం ఇదేనా 'నిత్య కళ్యాణం'గారూ? అని ప్రశ్నించారు. ప్యాకేజీ స్టార్లు, వివాహ వ్యవస్థపై గౌరవం లేని వారు ప్రజా నాయకులు ఎప్పటికీ కాలేరని అన్నారు. అతిగా ఊహించుకోవద్దని పవన్ కు హితవు పలికారు.
Pawan Kalyan
Vijayasai Reddy
YSRCP
Janasena

More Telugu News