Latha Mangeshkar: లతా మంగేష్కర్ ఆరోగ్యంపై తాజా బులెటిన్!

  • ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స
  • ప్రస్తుతానికి యాంటీ బయాటిక్స్ ఇస్తున్నాం
  • ఇన్ ఫెక్షన్ అదుపులోకి వస్తేనే చికిత్సలో ముందుకెళతామన్న డాక్టర్లు
తన గాన మాధుర్యంతో వేలాది పాటలను పాడి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లతా మంగేష్కర్, ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో సోమవారం నుంచి ఆమెకు చికిత్స జరుగుతోంది. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని, న్యుమోనియాతో పాటు గుండె సమస్యలు, ఛాతీలో ఇన్ ఫెక్షన్ తో లత బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు.

ఆమె ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ ను విడుదల చేస్తూ, ఆమెకు యాంటీ బయాటిక్స్ అందిస్తున్నామని, ఇన్ ఫెక్షన్ అదుపులోకి వచ్చిన తరువాతనే వైద్య ప్రక్రియ అంశంలో ముందుకు వెళతామని బ్రీచ్ క్యాండీ డాక్టర్ పతీత్ సంధానీ వెల్లడించారు. ప్రస్తుతానికి లత ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కాగా, లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో లక్షలాది మంది భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
Latha Mangeshkar
Mumbai
Health
Breach Candy

More Telugu News