Andhra Pradesh: ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలలో సీఎం జగన్ ఫొటోల వాడకం విషయంలో ఆదేశాలు

  • ప్రభుత్వ పథకాలు, బ్యానర్లు, కార్యక్రమాల్లో ఇష్టం వచ్చిన ఫొటోల వాడకం
  • ఇకపై రెండు పొటోలు మాత్రమే వాడాలంటూ ఆదేశాలు
  • ఫొటోలు విడుదల
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోల వాడకం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల కోసం ఉపయోగించే జగన్ ఫొటోల విషయంలో జాగ్రత్తలు తీసుకుంది. ప్రభుత్వ పథకాలు, ఇతర కార్యక్రమాల కోసం ఉపయోగించాల్సిన రెండు ఫొటోలను ఎంపిక చేసింది. ఇకపై ఈ రెండింటిని మాత్రమే ఉపయోగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. బ్యానర్లు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ సమయంలో ఇష్టం వచ్చిన ఫొటోలను ఉపయోగిస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిని మాత్రమే ఉపయోగించాలంటూ రెండు ఫొటోలను విడుదల చేసింది.

Andhra Pradesh
Jagan
Photos

More Telugu News