Hema Malini: హేమమాలినిని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ మంత్రి వ్యాఖ్యలు... మండిపడుతున్న బీజేపీ

  • వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చత్తీస్ ఘడ్ మంత్రి లఖ్మా
  • రోడ్లను హేమమాలిని బుగ్గల్లా నిర్మించానంటూ వ్యాఖ్య
  • వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతల డిమాండ్
ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని పేరును వాడుతూ చత్తీస్ ఘడ్ మంత్రి కవాసీ లఖ్మా చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను చేసిన మంచి పనులను ప్రస్తావించారు. ఈ ప్రాంతంలోని రోడ్లన్నింటినీ హేమమాలిని బుగ్గల మాదిరిగా నిర్మించానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. లఖ్మా వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

ఇక, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారడం లఖ్మాకు ఇదే తొలిసారి కాదు. గతంలో ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ కలెక్టర్, ఎస్పీలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు తనలా రాజకీయ నాయకుడు కావాలనుకుంటే కలెక్టర్, ఎస్పీల చొక్కా కాలర్ లు పట్టుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి.
Hema Malini
Kawasi Lakhma
Chhattisgarh
Prime Minister
Congress
BJP

More Telugu News