shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టును జల్లెడపట్టిన పోలీసులు.. ఏడుగురు అనుమానితుల అరెస్ట్

షార్ట్స్‌లో చూడండి
శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో ఏడుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ టెర్మినల్‌ ఆర్టీసీ బస్టాండ్ పార్కింగ్ ప్రదేశంతోపాటు అనుమతులు లేకుండా తిరుగుతున్న ట్యాక్సీలను తనిఖీ చేశారు. ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆరు ట్యాక్సీలను సీజ్ చేశారు. అనుమతులున్న ట్యాక్సీలలోనే ప్రయాణించాలని ఈ సందర్భంగా ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశారు. కార్డన్‌సెర్చ్‌లో ఏసీపీ, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, 100 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
Go Back to Shorts
shamshabad
airport
cordon search
Hyderabad

More Telugu News