Chandrababu: నేడు ఆ కలల సౌధం నిలువునా కూలిపోయింది: చంద్రబాబు

  • అమరావతి ఒప్పందాన్ని విరమించుకున్న సింగపూర్
  • విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • తీవ్ర ఆవేదనతో ట్వీట్
అమరావతి అభివృద్ధి కోసం కుదుర్చుకున్న ఒప్పందాన్ని సింగపూర్ ప్రభుత్వం విరమించుకోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సింగపూర్ ప్రభుత్వ నిర్ణయంతో కలల సౌధం కూలిపోయిందని, అమరావతి ప్రపంచస్థాయి నగరంగా రూపుదిద్దుకుంటుందన్న ఆశ ఆవిరైపోయిందని వ్యాఖ్యానించారు. "సింగపూర్ ప్రభుత్వం ఆనాడు మాతో అమరావతి నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు సరికొత్త ఆశలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొంగిపోయింది. కానీ నేడు కల చెదిరింది. పెట్టుబడులు వెళ్లిపోయాయి, నమ్మకం మంటగలిసింది. వినాశనం దిశగా ఆంధ్రప్రదేశ్ పయనిస్తోంది" అంటూ తీవ్ర ఆవేదనతో ట్వీట్ చేశారు.
Chandrababu
Andhra Pradesh
Amaravathi
Jagan
YSRCP

More Telugu News