Kamal Haasan: మహేశ్ బాబు ట్వీట్ కు రిప్లయ్ ఇచ్చిన కమలహాసన్
- ఇటీవల కమల్ 65వ జన్మదినోత్సవం
- విషెస్ తెలిపిన మహేశ్ బాబు
- సంతోషం వ్యక్తం చేసిన కమల్
విలక్షణ నటుడు కమలహాసన్ ఇటీవల తన 65వ జన్మదినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "సినిమా రంగానికి మీరందించిన సేవలు అసామాన్యం సర్. 60 ఏళ్ల సినిమా కెరీర్ ను పూర్తిచేసుకున్నందుకు శుభాభినందనలు" అంటూ ట్వీట్ చేశారు. దీనికి కమల్ బదులిచ్చారు.
"థాంక్యూ సో మచ్ మహేశ్ గారూ. మీరు కూడా నాలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి, అగ్రశ్రేణి హీరోగా ఎదిగారు. మీ హృదయపూర్వక శుభాకాంక్షలను వినమ్రంగా స్వీకరిస్తున్నాను. మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాను" అని తాజాగా ఓ ట్వీట్ చేశారు. దాంతో మహేశ్ బాబు కూడా ట్విట్టర్ వేదికగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.