ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీతో చర్చిస్తున్నాం: మల్లికార్జున ఖర్గే
- ఎన్నికలకు ముందే కాంగ్రెస్-ఎన్సీపీ పొత్తు
- ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటాం
- చర్చల అనంతరమే ఓ నిర్ణయంపై ముందుకు వెళతాం
'కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా చర్చలు జరిపారు. మరిన్ని చర్చలు జరపాల్సి ఉంది. ఓ నిర్ణయం తీసుకొని ప్రకటిస్తాం' అని మల్లికార్జున ఖర్గే చెప్పారు. కాగా, శరద్ పవార్ తో చర్చల బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ తమ సీనియర్ నేతలకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆయనతో చర్చించేందుకు అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్.. ముంబయి వెళ్లారు.